సుప్రీంకోర్టులో అమరావతి భవితవ్యం.. త్వరలో విచారణ
నవ్యాంధ్ర రాజధాని అమరావతి భవితవ్యం సుప్రీంకోర్టులో తేలనుంది. నవ్యాంధ్రకు అమరావతే రాజధాని అంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఇందుకోసం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనికి నంబరును గురువారం కేటాయించింది. పైగా చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణలో చేర్చాలని న్యాయవాదులు కోరారు. ఫలితంగా ఈ పిటిషన్‌పై ఏ క్షణమైనా విచారణకు వచ్చే అవకాశం ఉంది.
అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు దాఖలు చేసిన ఎస్.ఎల్.పి.పై విచారణ విషయంలో తమ వాదనలు కూడా వినాలని కోరుతూ అమరావతి రైతులు ఇప్పటికే కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత నెలలో ఏపీ సర్కారు ఎస్.ఎల్.పి.ని దాఖలు చేయడం గమనార్హం.