గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (19:32 IST)

ఒక్కడే 300ల మందికి మోసం.. అతని ఫోన్ చూసి బిత్తరపోయిన పోలీసులు!

ప్రేమ పేరుతో 300 మంది మోసం చేసాడు.. ఓ మోసగాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు  ఏకంగా 300 మందిని వేధించాడు ఈ మోసగాడు. ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు అన్నట్లు.. ఏకంగా 300 మందిని తన వలలో వేసుకుని మోసం చేశాడు. 
 
ఈ ఘటన ఏపీలోని కడపలో వెలుగులోకి వచ్చింది. తన మాటలతో  ఫేస్బుక్, షేర్చాట్ ఇంస్టాగ్రామ్‌లో అమ్మాయిలు ఆంటీలకు మాయమాటలు చెప్పి లోబరుచుకుని మోసం చేసిన ప్రసన్నకుమార్ అనే అనే యువకుడిని అరెస్టు చేశారు పోలీసులు. 
 
సోషల్ మీడియా వేదికగా ఆంటీలు అమ్మాయిలతో పరిచయం పెంచుకుని వారి అర్ధనగ్న చిత్రాలను రాబట్టి ఇక ఆ తర్వాత ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బులు గుంజుతున్నాడు.  
 
బాధితురాల్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసి సెల్ ఫోన్ చెక్ చేయగా దాదాపు 300 మంది అమ్మాయిలు ఆంటీలకు సంబంధించిన అర్ధనగ్న చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు. అతని ఫోన్ చూసి పోలీసులు బిత్తరపోయారు.