1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (17:59 IST)

ఏపీలో 2 వేల కిందకు దిగిన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 59,641 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,546 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. 
 
అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 416 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 229, ప్రకాశం జిల్లాలో 201 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,968 మంది కరోనా నుంచి కోలుకోగా, 15 మంది మరణించారు.
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 19,70,008 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,36,016 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,582 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 13,410కి చేరింది.
 
మరోవైపు, దేశంలో గత 24 గంటల్లో 40,134 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 36,946 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,95,958కు చేరింది.
 
మరణాల విషయానికొస్తే... ఆదివారం 422 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,24,773కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,08,57,467 మంది కోలుకున్నారు. 
 
మొత్తం 4,13,718 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 47,22,23,639 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న‌ 17,06,598 డోసులు వేశారు.