బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (13:32 IST)

మార్చి3వ తేదీన ఛలో ఆంధ్రా యూనివర్శిటీ

మార్చి3వ తేదీన ఛలో ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవీ హర్షకుమార్ ప్రకటించారు. ఆంధ్ర వర్శిటీ పరిరక్షణ కోసం ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన ప్రకటించారు. 
 
యూనివర్శిటీ స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఉందని మీడియాతో మాట్లాడుతూ.. జీవీ హర్షకుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిన వారికే వర్శిటీలో పెద్దపీట వేస్తున్నారని హర్షకుమార్ ఆరోపించారు. 
 
రిటైర్ అయిన ఉద్యోగిని తిరిగి రిజిస్ట్రార్‌గా నియమించిన చరిత్ర ఏ యూనివర్శిటీలోనూ లేదని హర్షకుమార్ తెలిపారు. యూనివర్శిటీలో జరుగుతోన్న అక్రమాలపై ప్రశ్నిస్తామన్నారు.