శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 4 జూన్ 2018 (17:42 IST)

ఇంటర్ మొదటి సంవత్సరం కొత్త భాషా పాఠ్యపుస్తకాలు విడుదల

అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కొత్త భాషా పాఠ్యపుస్తకాలను ఇంటర్ విద్యామండలి కార్యదర్శి బి.ఉదయలక్ష్మి సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో సోమవారం ఉదయం విడుదల చేశారు. ఆమె విడుదల చేసినవాటిలో తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాష పాఠ్యపుస్త

అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కొత్త భాషా పాఠ్యపుస్తకాలను ఇంటర్ విద్యామండలి కార్యదర్శి బి.ఉదయలక్ష్మి సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో సోమవారం ఉదయం విడుదల చేశారు. ఆమె విడుదల చేసినవాటిలో తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాష పాఠ్యపుస్తకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది మొదటి సంవత్సరం చదివేవారి కోసం మాత్రమే విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మొదటి ఏడాది భాషా పాఠ్యపుస్తకాలలో సిలబస్ ని పూర్తిగా మార్చినట్లు తెలిపారు. 
 
నైతిక విలువలు, ప్రవర్తన, పర్యావరణంకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం రెండవ సంవత్సరం చదివేవారి సిలబస్ ఏమీ మార్చలేదని, ఇప్పుడు మొదటి సంవత్సరం చదివేరు రెండవ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు వారి సిలబస్ మారుతుందని వివరించారు. రాష్ట్రంలోని విద్యార్థులు నీట్, జేఈఈ, సీఏ వంటి ఎంట్రన్స్ పరీక్షలకు, బ్యాంకింగ్, ఎల్ఐసీ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేవిధంగా సిలబ్‌లో మార్పులు, చేర్పులు చేశామని, కొన్ని చాప్టర్లలో అదనంగా చేర్చామని, కొన్ని కొత్త చాప్టర్లు చేర్చామని చెప్పారు. బయట ప్రపంచంతో పోటీపడేవిధంగా, వారిలో కమ్మూనికేషన్ స్కిల్, అవగాహనా శక్తి పెంచేవిధంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి కావలసిన రీతిలో  సిలబస్ రివ్యూ కమిటీ, కరికులం అప్ గ్రేట్ కమిటీ సూచనల మేరకు సమకాలీన పరిస్థితులకు కావలసి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సిలబస్ రూపొందించినట్లు తెలిపారు. 
 
అధ్యాపకులు అందరూ ఆయా సబ్జక్టులలో మాస్టర్ డిగ్రీలు, పీహెచ్‌డీలు చేసినవారని కొత్త సిలబస్ బోధించడంలో ఇబ్బందులు ఏమీ ఉండవని చెప్పారు. అవసరమైతే కొత్త సిలబస్‌కు సంబంధించి వారికి శిక్షణ ఇప్పిస్తామన్నారు. జేఈఈకి ఎంకికైనవారిలో 30 వేల మంది ఏపీ విద్యార్థులే ఉన్నారని, 1,2 ర్యాంకులు మన విద్యార్థులకే వచ్చాయని చెప్పారు.
 
కొత్తగా చేరే విద్యార్థులందరికీ సరిపడ పుస్తకాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బయట మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ప్రైవేటు పబ్లిషర్లు ఇంటర్ బోర్డుకు రాయల్టీ చెల్లించి, వారు కూడా ప్రింట్ చేసి అమ్ముతారని తెలిపారు. ప్రభుత్వం తరపున ఉచితంగా ఇచ్చే పుస్తకాలు కూడా సిద్ధంగా ఉంచామన్నారు. ఆన్లైన్ చదువుకునేవారికి ఈ బుక్స్ కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 5 నుంచి 5.5 లక్షల మంది విద్యార్థుల చేరే అవకాశం ఉంటుదని చెప్పారు. చట్ట వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన 300 కాలేజీలను గత ఏడాది రద్దు చేసినట్లు తెలిపారు. కొన్ని కాలేజీలకు పెనాల్టీలు విధించినట్లు చెప్పారు. నిబంధనలు ప్రకారం ఏర్పాటు చేసిన కాలేజీలకు అనుమతిస్తామన్నారు.