శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (16:24 IST)

జయలలిత ఆర్కే నియోజకవర్గం... శశికళపై ఆ విధంగా కసి తీర్చుకుంటుందా?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ నియోజకవర్గంలో అంతా బావుంటే రేపే ఎన్నికలు జరగాల్సి వుంది. కానీ పరిస్థితి తారుమారయింది. ఇక్కడ నుంచి పోటీకి దిగిన దినకరన్ తన శక్తి మేరకు ఎలాగైనా గెలిచి తీరాలని గట్టి ప్రయత్నమే చేశారు. ఈ ప్రయత్నంల

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ నియోజకవర్గంలో అంతా బావుంటే రేపే ఎన్నికలు జరగాల్సి వుంది. కానీ పరిస్థితి తారుమారయింది. ఇక్కడ నుంచి పోటీకి దిగిన దినకరన్ తన శక్తి మేరకు ఎలాగైనా గెలిచి తీరాలని గట్టి ప్రయత్నమే చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా సుమారు 90 కోట్ల రూపాయలకు పైగా ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 
 
సాధారణమైన నియోజకవర్గమైతే వదిలేసేవారే కానీ జయలలిత ప్రాతినిధ్యం వహించినది కావడంతో ఎలాగైనా గెలిచి తీరాలని అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. మరోవైపు డబ్బు పంచారంటూ 9 మంది మంత్రులపై ఆరోపణలు రావడంతో వారిని ఐటీ శాఖ విచారిస్తోంది. ఇంకోవైపు పార్టీ గుర్తు రెండాకులు లేకుండా టోపీ గుర్తుపై పోటీ చేయాల్సి రావడం ఒక రకంగా అన్నాడీఎంకే పార్టీకి పెద్ద దెబ్బయ్యింది. 
 
అన్నాడీఎంకే నాయకులు, మంత్రులు డబ్బు పంచినట్లు ఆరోపణలు రావడంతో వారి ఇళ్లపై ఐటీ శాఖ దాడులు చేస్తోంది. ఈ వార్తలన్నిటినీ విన్న శశికళ జైల్లోనే ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తమ్మీద జయలలిత తను ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచి శశి వర్గం గెలుస్తుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.