ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (19:07 IST)

అమరావతిలో అసైన్డ్ భూముల విక్రయం - ఐదుగురి అరెస్టు

apcid police
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల విక్రయంలో సీఐడీ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ భూముల విక్రయానికి సంబంధించి ఐదుగురిని సీఐడీ పోలీసులు అరెస్టు చేసింది. 1100 ఎకరాల్లో 169.27 ఎకరాలను విక్రయించడానికి నిందితులు సహకరించారని సీఐడీ ఆరోపిస్తుంది. 
 
ఈ నిందితులకు రామకృష్ణ హౌసింగ్ డైరెక్టర్ ఖాతా నుంచి రూ.15 కోట్ల మేరకు అదాయని వెల్లడించింది. సీఐడీ అధికారులు అరెస్టు చేసిన వారిలో కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు కొట్టి దొరబాబులు ఉన్నారు. 
 
ఈ అసైన్డ్ భూముల స్కామ్‌లో 1100 ఎకరాల భూములు చేతులు మారినట్టు సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇందులో 169.27 ఎకరాలకు విక్రయాలకు సంబంధించిన ఈ ఐదుగురు నిందితులు కీలక పాత్ర పోషించినట్టు పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, మాజీ మంత్రి నారాయణతో పాటు ఆయన సమీప బంధువుల ఆధ్వర్యంలో ఈ భూముల విక్రయాలు జరిగాయని, ఈ విక్రయాల్లో ఈ ఐదుగురు కీలకంగా వ్యవహరించారని ఆరోపించింది.