శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (22:05 IST)

డ్వాక్రా మహిళకు నెలకు రూ.10 వేలు వచ్చేట్లు చూస్తా... సీఎం చంద్రబాబు

నిరుపేద ప్రజలకు అండగా వుండి తన మానస పుత్రికైన డ్వాక్రా సంఘాల ప్రతి కుటుంబ సభ్యురాలి ఆదాయం నెలకు రూ. 10 వేల వరకూ పెంచే మార్గాన్ని తాను తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మంగళవారం నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో డ్వాక్రా సంఘాల సద

నిరుపేద ప్రజలకు అండగా వుండి తన మానస పుత్రికైన డ్వాక్రా సంఘాల ప్రతి కుటుంబ సభ్యురాలి ఆదాయం నెలకు రూ. 10 వేల వరకూ పెంచే మార్గాన్ని తాను తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మంగళవారం నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో డ్వాక్రా సంఘాల సదస్సులో ఆయన పాల్గొన్నారు. 
 
భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి గత మూడేళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందని అభివృద్ధికి ఓటు వేసి జీవితంలో మరిచిపోలేని ఆదరణ చూపారన్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు అండగా వుండి ప్రతి కుటుంబ ఆదాయాన్ని పదివేల వరకూ పెంచేందుకు తను కృషి చేస్తానన్నారు. 
 
నంద్యాల నియోజకవర్గంలో ఉపఎన్నికలకు ముందు దాదాపు 1660 కోట్ల రూపాయలతో 285 పనులు ప్రారంభించామని, పనులన్నిటినీ త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా, సుందర నగరంగా నంద్యాలను తీర్చిదిద్దుతున్నారు. 
 
రాయలసీమలో అన్ని ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తిచేసే బాధ్యత తీసుకుంటానని పనులన్నీ పూర్తయితే కరువు సమస్యే వుండదన్నారు. సకాలంలో పెన్షన్ అందకపోయినా, చనిపోయిన వ్యక్తులకు చంద్రన్న బీమా వర్తించకపోయినా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు 1100కి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి పరిష్కరిస్తామని చెప్పారు.