మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (20:56 IST)

ఏపీ సీఎం జగన్ అమెరికా టూర్ ఖరారు

ఏపీ సీఎం వైఎస్ జగన్ అమెరికా టూర్‌కు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జగన్ అమెరికా వెళ్తారు.వారం రోజుల పాటు జగన్ అమెరికాలో పర్యటిస్తారు.
 
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ తొలిసారిగా అమెరికాకు వెళ్తున్నారు.  ఆగష్టు 17వ తేదీ నుండి 23వ తేదీవరకు అమెరికాలో పర్యటిస్తారు. అమెరికాలో నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీ ఆహ్వాన సభలో జగన్ పాల్గొంటారు. ఈ నెల 17వ తేదీన ఈ కార్యక్రమం ఉంటుంది.
 
 ఆ తర్వాత డల్లాస్‌లో జరిగే కేబెల్లే కన్వెన్షన్ సెంటర్‌లో ప్రవాస భారతీయులు నిర్వహించే భారీ సభలో కూడ  జగన్ పాల్గొంటారని సమాచారం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాకు జగన్ కుటుంబసభ్యులతో వెళ్తున్నారు.