Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మద్యం దుకాణాల్లో అక్రమ అమ్మకాలు.. ఎక్సైజ్ అధికారుల సోదాలు

Written By ఠాగూర్
Updated: గురువారం, 10 జూన్ 2021 (19:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోణలు వచ్చాయి. దీంతో ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ఆంక్షలతో కూడిన లాక్డౌన్‌ను అమలుచేస్తున్నారు. అదేసమయంలో మద్యం దుకాణాల్లో జోరుగా అమ్మకాలు జరుగతున్నాయి. 
 
అయితే, ఈ దుకాణాల్లో పనిచేసే సిబ్బంది చేసివాటం ప్రదర్శించారు. ఫలితంగా వారు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 
 
విశాఖపట్నం ఎక్సైజ్ సిబ్బంది నిర్వాకంపై జరుపుతున్న విచారణ అక్కడితో ఆగిపోలేదు.. మిగిలిన జిల్లాల్లో ఎక్సైజ్ సిబ్బంది మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమ అమ్మకాలపై మీడియాలో వరుస కథనాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కథనాలకు స్పందించిన మంత్రి నారాయణస్వామి విచారణకు ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు రంగంలోకి దిగారు. 
 
ఎక్కడికక్కడ ప్రభుత్వ వైన్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. షాపులో ఉన్న స్టాక్.. కొద్దిరోజులుగా జరిగిన అమ్మకాలు లెక్కలు తీశారు అధికారులు.
 
గంగాధర నెల్లూరు ప్రభుత్వ మద్యం దుకాణంలో ఏడూ లక్షల రూపాయలను సిబ్బంది స్వాహా చేశారు. దుకాణం సూపర్ వైజర్ నారాయణ, సేల్స్‌మెన్ లోకేష్, సాగర్ చేతివాటం ప్రదర్శించినట్టు గుర్తించారు. 
 
తమిళనాడు వ్యాపారులతో సిబ్బంది కుమ్మక్కయినట్టు నిర్ధారణ చేశారు. తమిళనాడుకు చేరవేస్తున్న 30 వేల రూపాయల విలువైన మద్యం సీజ్ చేశారు. మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. 
 
ఇలా ఇక్కడ ఒక్కచోటే కాదు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోన్నట్టు అధికారులు గుర్తించారు. ఏపీలో ప్రభుత్వ ఎక్సైజ్ షాపుల్లో భారీగా మోసాలు జరుగుతున్నాయని మీడియాలో వరుస కథనాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. 

అన్నీ చూడండి

గుడ్ టైం మూవీ తో అందరికీ గుడ్ టైం రాబోతుందన్న ప్రముఖులు

OG 2 Latest update :పవన్ కళ్యాణ్ ఓజీ 2 గురించి తాజా అప్‌డేట్

Raja Singh: ఫ్యామిలీతో చూసే సినిమా తీయండని యశ్‌కు రాజాసింగ్ విజ్ఞప్తి

Vijay Deverakonda: ఆయన పిలిచాక రాకుంటే నేను బతికి ఎందుకు?.. విజయ్ దేవరకొండ ఎమోషనల్

Gautam: గౌతమ్ ఘట్టమనేని కు కుటుంబసభ్యులు, ఫౌండేసన్ శుభాకాంక్షలు

తర్వాతి కథనం
Show comments