మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (16:45 IST)

ఏపీలో బ్యాంకు వేళల్లో మార్పులు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం నుంచి బ్యాంకు పనివేళలు మారనున్నాయి. రాష్ట్రంలో రేపటి నుంచి జనజీవన కార్యకలాపాలకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతించనున్నారు. 
 
ఈ నెల 20 వరకు ఈ తాజా వేళలు అమల్లో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు పనివేళలను అందుకు అనుగుణంగా సవరించారు. బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. 
 
అయితే, బ్యాంకుల సిబ్బంది తమ పరిపాలనా విధుల నిమిత్తం సాయత్రం 5 గంటల వరకు బ్యాంకుల్లోనే ఉండనున్నారు. ఈ మేరకు బ్యాంకుల పనివేళల్లో ఎస్ఎల్ బీసీ సమావేశంలో నిర్ణయించారు. ఏపీలో జూన్ 20 వరకు కర్ఫ్యూ పొడిగించిన సంగతి తెలిసిందే.