బ్యాంకు పనివేళల్లో మార్పులు..

sbi bank
sbi bank
సెల్వి| Last Updated: గురువారం, 10 జూన్ 2021 (12:45 IST)
తెలంగాణలో నిన్నమొన్నటి వరకు కరోనా లాక్ డౌన్‌తో మధ్యాహ్నం వరకే బ్యాంకులు పనిచేశాయి. అయితే గురువారం నుంచి బ్యాంకు పని వేళలు యథావిధిగా కొనసాగుతాయని ఎస్‌ఎల్‌బీసీ తెలిపింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో గతంలో మాదిరిగానే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగుతాయని పేర్కొంది.

మంగళవారం కేబినెట్‌లో లాక్‌డౌన్‌ను ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పొడగించడంతో పాటు సడలింపు సమయం ఉదయం 6 గంటల నుంచి 5 గంటల వరకు పెంచిన విషయం తెలిసిందే. మేలో లాక్‌డౌన్‌ అమలు చేసిన నాటి నుంచి బ్యాంకు పని వేళలు మారాయి. లాక్‌డౌన్‌ ప్రారంభంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, జూన్‌ ఒకటో తోదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు సేవలందించాయి.

అయితే ఈ నెల 10 నుంచి లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంతో సాధారణ సమయాల్లోనే బ్యాంకింగ్‌ కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొంది. బ్యాంకింగ్‌ సమయ వేళలను ఖాతాదారులు గమనించాలని ఎస్‌ఎల్‌బీసీ సూచించింది. సాయంత్రం వరకు బ్యాంకులు పనిచేస్తాయని ఖాతాదారులకు బ్యాంకు అధికారులు తెలిపారు.దీనిపై మరింత చదవండి :