మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (15:27 IST)

కోర్టుకెక్కేవారంతా చెత్త దరిద్రులే : ఏపీ డిప్యూటీ సీఎం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా పాలన చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేనివారు, అభిృద్ధిని అడ్డుకోవాలనుకునేవారే కోర్టులకు వెళుతున్నారన్నారు. ఇలాంటి వాళ్ళంతా తన దృష్టిలో దరిద్రులేనని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. 
 
చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో మంగళవారం ఆయన సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కనీసం కుక్కకు ఉండే విశ్వాసం కూడా రఘురామకృష్ణరాజుకు లేదన్నారు. 
 
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్‌ ఏది అమలు చేసినా వెంటనే మాజీ సీఎం చంద్రబాబు ప్రోద్భలంతో టీడీపీ నాయకులు కోర్టులకు వెళ్లి అడుగడుగునా అడ్డుతగులుతున్నారని నారాయణస్వామి ఆరోపించారు.