గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

కాంట్రాక్టు లెక్చర్లకు శుభవార్త చెప్పిన సీఎం జగన్ సర్కారు

cash
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ విద్యా సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చర్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చర్చకు వేతన స్కేలును పెంచుతున్నట్టు వెల్లడించింది. రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం మినిమం టైమ్ స్కేల్‌ను అమలు చేస్తున్నామని వెల్లడించింది. 
 
అయితే, ఈ పెంపు కూడా జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్టు సొసైటీ కార్యదర్శి ఆర్.నరసింహారావు వెల్లడించారు. మరోవైపు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద జీతాలలను పొందుతున్న ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులను విద్యాశాఖలో విలీనం చేయాలని ఏపీ ఉపాధ్యాయుల సంఘం కోరింది.