సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (13:55 IST)

ప్రభుత్వ ఆస్పత్రిలో గవర్నర్ హరిచందన్ తనిఖీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలించారు. ఈ సందర్భంగా బ్లాక్ నెంబర్ 3వ వార్డ్‌లో రోగులను ఆయన పరామర్శించారు. 
 
ఆరోగ్య శ్రీ వార్డ్స్ ఆరేషన్ థియేటర్లు, సర్జికల్ వార్డ్స్, సర్జికల్ ఐ.సి.యూలను గవర్నర్ పరిశీలించి రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్, అల్ట్రా సౌండ్ విభాగం సైతం పరిశీలించి.. కొన్ని సూచనలు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రిలో వసతులు సంతృప్తినిచ్చాయన్నారు. పేదలకు అందుతున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. రోగుల కోసం  ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులు భేష్ అని ఆయన కొనియాడారు.