ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు

Narendra Modi
సిహెచ్| Last Modified గురువారం, 17 సెప్టెంబరు 2020 (18:46 IST)
దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్
హరిచందన్
గురువారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిని ఉద్దేశించి రాసిన లేఖలో గవర్నర్ శ్రీ హరిచందన్ మోదీ పుట్టినరోజు నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం పలు ఇబ్బందులను సమర్ధవంతంగా ఎదుర్కుందని, ప్రధాని మార్గనిర్ధేశకత్వంలో కరోనా మహమ్మారి వల్ల ఎదురవుతున్న సవాళ్ల నుండి సైతం మన దేశం త్వరలోనే
విజయవంతంగా బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశాన్ని తన రాజకీయ చతురత, నేర్పు, ఓర్పులతో నరేంద్ర మోదీ ముందుకు తీసుకువెళుతున్నారన్నారు.
ప్రధాని మంచి ఆరోగ్యం, ఆనందాలతో ఫలవంతమైన జీవితం గడపాలని గవర్నర్ ఆకాంక్షించారుదీనిపై మరింత చదవండి :