సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (08:58 IST)

పవర్ స్టార్ బర్త్‌డే .. శుభాకాంక్షల వెల్లువ - ఫస్ట్ చెప్పింది సమంతనే...

పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు వేడుకలను సెప్టెంబరు రెండోతేదీ అయిన బుధవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో శుభాకాంక్షల వరద పారుతోంది. ఆయన సెప్టెంబరు రెండో తేదీతో 49 యేళ్లు పూర్తి చేసుకుని 50వ యేటలోకి అడుగుపెట్టారు. 
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు, సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖులు ప‌వ‌న్‌కు సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తెలంగాణ గ‌వ‌ర్న‌రు త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప‌వ‌న్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు.
 
'జన్మ‌దిన శుభాకాంక్ష‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు. మీరు ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని, జీవితంలో మ‌రెన్నో విజ‌యాలు సాధించాలని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని త‌మిళిసై త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
మరోవైపు, టాలీవుడ్ సుందరి సమంత పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. పవన్ రేపు (సెప్టెంబరు 2) బర్త్ డే జరుపుకుంటున్నారు. పవన్‌తో కలిసి 'అత్తారింటికి దారేది' వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించిన సమంత... ఈ సందర్భంగా ముందస్తుగా స్పందించింది. నిజంగా అద్భుతమైన వ్యక్తి పవన్ కల్యాణ్ సర్‌కు వెరీ హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేసింది. 'గొప్ప విజ్ఞానంతో గొప్ప బాధ్యతలు వస్తాయి, మీకు ఎప్పటికీ మంచి ఆరోగ్యం, ఘనమైన సంతోషం దక్కాలని ఆశిస్తున్నట్టు' అని పేర్కొంది.