సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (16:18 IST)

మీసేవ కేంద్రాల కొనసాగింపుపై స్పష్టత ఇవ్వాలి

రాష్ట్రంలో మీసేవ కేంద్రాల ద్వారా అనేక ధ్రువీకరణ పత్రాలు సేవలందిస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ కొద్దిరోజులుగా కొన్ని వార్తా పత్రికలలో ఎలక్ట్రానిక్ మీడియాలో మీ-సేవ కేంద్రాలను రద్దు చేసి మూసి వేస్తున్నట్లు మూసివేసే ఆలోచనలో కథనాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీ సేవ కేంద్రాల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని మీ సేవ నిర్వాహకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం తాసిల్దార్‌కి మీసేవ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్, కడప జిల్లా మీసేవా కార్యదర్శి రాఘవ రెడ్డి, వేంపల్లి మండలము స్థానిక మీసేవ నిర్వాహకులు సుభాష్, రమణ రెడ్డి, శ్రీనాధ్ తదితరులు కలిసి ఓ వినతిపత్రం సమర్పించారు. 
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీ సేవ కేంద్రాల పాత్ర ఎనలేనిది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9000 మీసేవ కేంద్రాలు ఉన్నాయని దాదాపు 50 వేల మంది మీ సేవ కేంద్రంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వం నుంచి 40 శాతం ప్రజలకు అనేక సర్వీసులు మీ సేవ కేంద్రాల ద్వారా అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్మించిన గ్రామ వాలంటీర్ విధి విధానాలు మీ కేంద్ర మీ సేవ కేంద్రాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది అన్నారు. 
 
మీ-సేవ కేంద్రాలను రద్దుచేసి ఈ-గ్రామ సచివాలయం సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీంతో మీ సేవ అ నిర్వాహకులు తీవ్ర మనోవేదనకు చెందుతున్నారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మీ సేవా కేంద్రాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు కోరారు.