ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (18:04 IST)

ఏపీ హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు ఊరట.. ఎలా?

Mohan Babu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబు కుటుంబానికి ఊరట లభించింది. గత 2019 ఎన్నికలకు ముందు ధర్నాకు దిగి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో ఆయన ఊరట లభించింది. ఈ కేసు విచారణను నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో మోహన్ బాబు తరపున కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన కోర్టు 8 వారాల పాటు విచారణను వాయిదా వేసింది. 
 
గత 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆరోపిస్తూ తన ఇద్దరు కుమారులతో కలిసి మోహన్ బాబు ధర్నాకు దిగారు. ఈ వ్యవహారంపై మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారులపై తిరుపతి పోలీసుల కేసు నమోదైంది. 
 
ఈ కేసు విచారణ తిరుపతి కోర్టులో సాగుతోంది. ఈ విచారణను నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు తిరుపతి కోర్టులో కేసు విచారణను ఎనిమిది వారాల పాటు నిలుపుదల చేసింది.