బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (18:49 IST)

ఎ.పి. రెవిన్యూ అధికారుల తీరుపై నిర్మాత‌ల మండ‌లి మండిపాటు

Nattikumar
ఆంధ్ర ప్ర‌దేశ్ హైకోర్టు సస్పెండ్  చేసిన సినిమా టిక్కెట్ల రేట్ల జీవో 35ను రెవిన్యూ అధికారులు అమలుపరచడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని ప్రముఖ నిర్మాత నట్టికుమార్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ లోని ఫిలింఛాంబర్ లో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యవర్గంతో  కలసి  విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు.
నట్టి కుమార్ మాట్లాడుతూ,. సస్పెండ్ అయిన  జీవో 35 రేట్ల ప్రకారమే సినిమా థియేటర్లలో  టిక్కెట్లు అమ్మవలసిందిగా రెవిన్యూ అధికారులు థియేటర్ల వారిని బెదిరిస్తున్నారు. రేపు భీమ్లా నాయక్ సినిమా విడుదలవుతుండటంతో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఎమ్మార్వోలు, ఆర్దీవోలు, జాయింట్ కలెక్టర్ లు థియేటర్ల వారిని టార్చెర్ పెడుతున్నారు.  5/-,రూపాయలు 10/-, 15/- 20/- రూపాయల చొప్పున టిక్కెట్లు అమ్మాలని, లేకుంటే కేసులు పెడతామని రెవిన్యూ అధికారులు వత్తిడి తెస్తున్నారు. ఇది కంటెంప్ట్ అఫ్ కోర్టు కిందకు వస్తుందని అధికారులకు తెలియదా?. తెలుగు చిత్ర పరిశ్రమ కళ కళలాడాలని భావించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద, చిన్న సినిమాల కోసం చాలా మంచి నిర్ణయాలను తీసుకునే కసరత్తు చేస్తోంది. 
 
ఈ క్రమంలోనే కొత్త జీవో అతి త్వరలో వస్తుందని అందరూ ఆశిస్తున్నారు..కొత్త జీవో లోపు వచ్చేలోపు థియేటర్ల వారు జాయింట్ కలెక్టర్ లకు సమాచారాన్ని అందజేసి. సినిమా టిక్కెట్ల రేట్లను తగినంతగా పెంచుకునే  వెసులు బాటు ఉన్నపటికీ, అధికారులు  మాత్రం దానిని అస్సలు పట్టించుకోవడం లేదు. ఏపీ ఉద్యోగులు  తమ‌ జీతాల పెంపు కోసం అందరూ కలసి కదం తొక్కారు..కానీ అదే మీరు మా‌ థియేటర్ ల వద్దకు  వచ్చి, హైకోర్టు సస్పెండ్ చేసిన జీవో 35 రేట్లకు టిక్కెట్ల రేట్లు  అమ్మమని బెదిరింపులకు పాల్పడటం శోచనీయం. థియేటర్ల వారు టాక్స్ సరిగా కట్టకపోవడం, ఇంకా బ్లాక్ల్ లో  అధిక ధరలకు టిక్కెట్ల రేట్లు అమ్మించడం వంటి ఇతర కారణాలు ఏవైనా ఉంటే అలాంటి థియేటర్ల పై  చర్యలు తీసుకుంటే తప్పు లేదు. కానీ ఇలా వేధించడం కరెక్ట్ కాదు. బహుశా అధికారులు వ్యవరిస్తున్న తీరు సీఎం జగన్ గారికి తెలిసుండదు. ఆయనపై మాకు చాలా నమ్మకం ఉంది.  
 
తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఆయన చాలా మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారులు మాత్రమే రాతపూర్వకంగా కాకుండా అనధికారికంగా థియేటర్లపై ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారు.  అందుకే మేము సీఎం గారు జోక్యం చేసుకోవాల్సిందిగా వారికి తెలుగు చిత్ర పరిశ్రమ తరపున  విన్నవిస్తున్నాం.  సినిమాను సినిమా లానే చూడాలి. సినిమా రంగంలోని వాళ్ళం బయట ఏదైనా, సినిమా రంగంలో మాత్రం మా అందరిదీ ఒకే కులం' అని అన్నారు. 
 
నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ``మేము ఎపి ప్రభుత్వానికి విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నాం. థియేటర్లను  తనిఖీలు  చేయటం తప్పుకాదు..కానీ సస్పెండ్ అయిన జీవో రేట్లకు అమ్మమనటం తప్పు.. సీఎం జగన్ గారు ఈ విషయంపై అందరి‌ అధికారులకు మీరు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం  త్వరలో కొత్త జీవో  వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నాం..సినిమా వారు రకరకాల పార్టీల్లో ఉంటారు..మాపై  రాజకీయాలు చెయ్యెద్దని కోరుతున్నాం..‌
లక్షలాది కుటుంబాలు సినిమాలపై ఆదారపడి ఉన్నాయి. రాజ్యాంగబద్దంగా వెళ్లాలని అధికారులను అదేశించాలి. 
మీ నుండి కొత్త జీవో వచ్చేవరకైనా..ఒకప్పుడు వైఎస్ఆర్ గారు ఇచ్చిన  జీవో 100 ను అయినా కనీసం అమలుపరచండి..
పెద్ద సినిమాలకు రెండువారాల పాటు 75 శాతం పెంచుకునే వెసులుబాటును సైతం కల్పించండి' అని అన్నారు. 
:ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ ఏలూరు సురేందర్ రెడ్డి, మాట్లాడుతూ, టెలివిజన్ లేని రోజుల రేట్లకు  సినిమాలు చూడమనం భావ్యం‌కాదు. ప్రభుత్వం సినీ పరిశ్రమతో చర్చలు జరిపేటప్పుడు, ఫిలిం ఛాంబర్ ను, నిర్మాతల మండలిని పరిగణలోనికి తీసుకోవాలి..ఎక్కడైనా కరెంటు, పెట్రోలు రేటు ఒక్కటే ఉందిఅలాగే ఎ, బి, సి సెంటర్ ఏదైనా  సినిమా టికెట్ రేటు ఒకటే ఉండాలి. ఆడియెన్స్  లగ్జరీగా సినిమా చూడాలని ఆలోచిస్తున్నారు..ప్రభుత్వం నిర్మాతలకు కమిటిలో అవకాశం ఇవ్వాలి" అని అన్నారు. 
ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి మోహన్ వడ్లపట్ల పాల్గొన్నారు