శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 21 అక్టోబరు 2018 (13:16 IST)

షెటిల్ ఆడుతూ బోర్లాపడిన ఆంధ్రా హోం మంత్రి చిన్నరాజప్ప

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి చిన్నరాజప్ప బోర్లాపడ్డారు. కాకినాడలోని స్థానిక వివేకానంద పార్కు ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన షెటిల్‌ కోర్టును ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కోర్టులో షటిల్ ఆడారు. ఈ సందర్భంగా కాలుజారడంతో ఆయన బోర్లా పడ్డారు. దీంతో దరూ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. 
 
గతంలో సంజీవిని ఆస్పత్రిలోని రోగిని పరామర్శించేందుకు విచ్చేసిన సందర్భంగా ఆస్పత్రి లిఫ్ట్‌ అదుపు తప్పడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తిరిగి అదే ఆస్పత్రి ఎదురుగా ఉన్న వివేకానంద పార్కు ప్రారంభోత్సవంలో మళ్లీ అపశ్రుతి దొర్లడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. 
 
ఆ వెంటనే తేరుకున్న సిబ్బంది అప్రమత్తమై ఆయన్ని పైకి లేపారు. అయితే ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో మిగిలిన కార్యక్రమాలను పూర్తిచేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షలకు వెళ్లినట్టు సమాచారం.