బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 17 డిశెంబరు 2021 (18:38 IST)

గూగుల్ మ్యాప్ లో పెన్సిల్ పెట్టి గీస్తే... అది అవుట‌ర్ రింగ్ రోడ్ అయిపోతుందా?

విజ‌య‌వాడ‌కు అస‌లు రింగ్ రోడ్డు ఎక్క‌డుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్ర‌శ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో గూగుల్ మ్యాప్ లో పెన్సిల్ తో  ఒక గీత గీశారు ... పెన్సిల్ తో గీత గీస్తే ఔటర్ రింగ్ రోడ్డు అవుతుందా? అని ఎద్దేవా చేశారు. 
 
 
అమరావతి రాజధాని వద్దు అని ఎవరు అన్నారు? అని మంత్రి పేర్ని నాని ప్ర‌శ్నించారు. అమరావతి కూడా ఒక రాజధాని అని పేర్కొన్నారు. జగన్ సీఎం అయ్యాక చిన్న అవుట్ పల్లి నుంచి చిన్నకాకాని వరకు ఔటర్ రింగ్ రోడ్డు వేయిస్తున్నార‌ని, చెప్పారు. చంద్రబాబు ఐదేళ్లు చిన్నఫ్లై ఓవర్ కూడా  కట్టలేకపోయార‌ని పేర్కొన్నారు.


రాజధాని రైతులు పాద యాత్ర కోసం చేసిన ఖర్చు, అమరావతిలో ఒక రోడ్డుకు అయినా  ఖర్చు చేయాల్సింద‌ని హితవు పలికారు. అమరావతి శాసన రాజధానిగా అభివృద్ధి జగన్ మోహన్ రెడ్డి చేతులు మీదుగా జరుగుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి పేరుతో చంద్రబాబు ఇంకా ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్నార‌ని మంత్రి విమ‌ర్శించారు.