శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 ఆగస్టు 2022 (19:01 IST)

సీఎం జగన్ మహిళా పక్షపాతి.. గోరంట్ల వీడియో మార్ఫింగ్: ఆర్కే రోజా

rk roja
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని ఏపీ మంత్రి ఆర్కే.రోజా అన్నారు. పైగా, హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నవీడియో వ్యవహారంపై కూడా ఆమె స్పందించారు. ఆ వీడియోను మార్ఫింగ్ చేశారన్నారు. 
 
 
వీడియో నిజమో, కాదో తెలసుకోకుండా టీడీపీ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. సీఎం జగన్ విచారణకు ఆదేశించారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో మహిళపై లెక్కలేనని దాడులు జరిగిన ఒక్క కేసు కూడా నమోదుచేయలేదని విమర్శించారు. నారాయణ స్కూల్స్‌లో ఆడపిల్లలు చనిపోతే ఒక్క కేసైనా పెట్టారా? అంటూ నిలదీశారు. 
 
మరోవైపు, ఇటీవల తాను కొత్త కారు కొంటే టీడీపీ నేతలు 'రుషికొండ గిఫ్ట్' అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ రోజుల్లో మామూలు యాంకర్లు, చిన్న నటులు సైతం కారు కొంటున్నారన్నారు. అయితే ఇంత పెద్ద స్థాయిలో ఉన్న నేను కారు కొనడం తప్పన్నట్టుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కారు కొనాలంటే లోన్ తీసుకుంటే సరిపోతుందని, తాను కారు కొనడం గొప్పేమీ కాదని అన్నారు. తన కొత్త కారు విషయంలో ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు ఏదీ దొరక్క ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తున్నారని రోజా విమర్శించారు. 
 
ఏది అమ్మినా, ఏది కొన్నా ఎంతో పారదర్శకతతో ఉంటానని స్పష్టం చేశారు. చదువురాని వారికి కూడా తాను సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని, తాను జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత పారితోషికం తీసుకున్నదీ బ్యాంకు ఖాతా లావాదేవీలు పరిశీలిస్తే అర్థమవుతుందని రోజా వ్యాఖ్యానించారు.