శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , సోమవారం, 27 సెప్టెంబరు 2021 (11:02 IST)

మార్చాల్సింది మంత్రులను కాదు... ముఖ్యమంత్రిని!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం మార్చాల్సింది మంత్రులను కాదని, ముఖ్యమంత్రి నే మార్చాలని  ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్. తులసిరెడ్డి అన్నారు. జగన్ పాలనలో మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారారని, వారు ఆరో వేలుతో సమానమని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్ర సమస్యల్లా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డేనని, అప్పుల ఆంధ్రప్రదేశ్, అరాచక ఆంధ్ర ప్రదేశ్, అవినీతి ఆంధ్రప్రదేశ్, అసమర్ధ ఆంధ్రప్రదేశ్, ఆటవిక ఆంధ్ర ప్రదేశ్  వీటన్నిటికీ మూల కారకుడు ముఖ్యమంత్రి జగన్ అని ఆరోపించారు.
 
జగన్ ని మారిస్తే తప్ప, ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కారం కావని తులసిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి కంటే సమర్ధంగా పరిపాలించే వాళ్లు అనేక మంది జగన్ పార్టీలో ఉన్నారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డిని మార్చకుండా మంత్రులను మార్చడమంటే, చేతగాని వైద్యుడు పంటి నొప్పికి, తుంటి మీద తన్నినట్లేనని తులసిరెడ్డి అన్నారు.