శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Updated :విజయవాడ , సోమవారం, 20 సెప్టెంబరు 2021 (14:24 IST)

కంగ్రాట్స్ జ‌గ‌న్ సార్! వైసీపీ మంత్రుల విజ‌య గ‌ర్వం!

ప్ర‌తికూల ప‌రిస్థితుల‌లోనూ అనుకూల ఫ‌లితాలు సాధించిన వైసీపీ నేత‌ల్లో విజ‌య గ‌ర్వం తొణికిస‌లాడుతోంది. ముఖ్యంగా మంత్రులంతా చాలా కుషీగా క‌నిపిస్తున్నారు. త‌మ అధినేత జ‌గ‌న్ సార్ కి మంచి ఫ‌లితాలు అందించామ‌నే ఆనందంలో ఉన్నారు. ప‌లువురు మంత్రులు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌గ‌న్ సార్ ని క‌లిసి అభినంద‌న‌లు తెలుపుతున్నారు. 
 
పరిషత్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపధ్యంలో క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్‌, దేవాదాయ ధర్మాదాయశాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ముఖ్య మంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్ దవులూరి దొరబాబు సీఎం జ‌గ‌న్ ని క‌లిసిన వారిలో ఉన్నారు.