శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 5 అక్టోబరు 2021 (13:12 IST)

ఏపీపీఎస్సి జూనియర్‌ అసిస్టెంట్స్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో త్వరలోనే 670 జూనియర్‌ అసిస్టెంట్స్‌, మరో 190 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామ‌ని ఏపీపీఎస్సీ సెక్రటరీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు వెల్ల‌డించారు. ఏపీలో ఉద్యోగ నియామ‌కాల కోసం ఎదురు చూస్తున్న‌ నిరుద్యోగులకు ఇది ఏపీపీఎస్సీ చెప్పిన శుభవార్త. త్వరలోనే 670 జూనియర్‌ అసిస్టెంట్స్‌, మరో 190 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఏపీపీఎస్సీ సెక్రటరీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తెలిపారు.
 
విజ‌య‌వాడ‌లోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏపీపీఎస్సి కార్యాల‌యంలో సోమ‌వారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో పీఎస్ఆర్‌ ఆంజనేయులు మాట్లాడుతూ, ‘‘త్వరలోనే జూనియర్‌ అసిస్టెంట్స్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తాం అని చెప్పారు. ఒక్కొక్కటిగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామ‌ని, గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యాంకణంపై ఏపీ హైకోర్టు తీర్పును గౌరవిస్తామ‌ని  తెలిపారు.