శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (11:06 IST)

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త - గ్రూపు-1, 2 పోస్టుల భర్తీకి ఓకే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. గ్రూపు 1, 2 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. గ్రూపు 1, 2 పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. 
 
ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు మొత్తం 292 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ సమ్మతం తెలిపింది. ఇందులో గ్రూపు-1 పోస్టులు 110, గ్రూపు-2 పోస్టులు 182గా ఉన్నాయి. మొత్తం 292 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 
 
వాస్తవానికి గతంలో ప్రకటించి జాబ్ క్యాలెండరులో కేవలం 36 పోస్టులు మాత్రమే ఉన్నాయి. దీంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఆందోళనకు దిగారు. కానీ, ఇపుడు ఏకంగా 292 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే జాబ్ క్యాలెండరులో ప్రకటించిన పోస్టుల కంటే ఇపుడు ప్రకటించిన పోస్టుల సంఖ్య భారీగా పెరిగింది.