గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (10:06 IST)

నీ బ్రోకరేజ్ ఏంటో కూడా తెలుసు : విజయసాయికి అయ్యన్న స్ట్రాంగ్ కౌంటర్

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డిపై నిప్పులు చెరిగారు. అయ్యన్నపాత్రుడు ఏమన్నారంటే...!
 
"సొంత తండ్రి చనిపోతే 24 గంటల పాటు జగన్ రెడ్డి కలకత్తా హోటల్ లో ఏమి చేసాడో తెలియదు అనుకున్నావా?తండ్రి శవం పక్కన దొరక్కముందే సంతకాల సేకరణ ఎందుకు చేసాడో తెలియదు అనుకున్నావా? తన తండ్రిని రిలయన్స్ వాళ్ళు చంపేశారని, ప్రచారం చేసి, చివరకు అదే రిలయన్స్ మనిషికి ఎంపీ సీటు ఇచ్చింది తెలియదు అనుకున్నావా?

ఇందులో నీ బ్రోకరేజ్ ఏంటో కూడా తెలుసు 'ఏ2' అలియాస్ 'కేటు'. బాబాయ్ ఎలా పోయాడో తెలియదు. సొంత మామ ఎలా పోయాడో తెలియదు. చివరకు తండ్రి మరణం వెనుక కూడా అనుమానాలు ఉన్నాయి అంటే, మీరు ఎంత రాక్షస జాతో అందరికీ తెలుసు.

నువ్వు కూడా హత్యలు గురించి మాట్లాడే వాడివే. రంగా హత్యలో, మీ మహా మేత పాత్ర ఏమిటో విజయవాడ మొత్తం తెలుసు.ఎక్కువ లాగమాక, తెగుద్ది. ఎమ్మెల్యే వెలగపూడి పై చేసిన ఆరోపణలు నిరూపించే దమ్ము ఉంటే నిరూపించు సాయిరెడ్డి."
 
ఇళ్ల పట్టాల స్కీంలో రూ. 6,500 కోట్ల అవినీతి:
ఏ1 జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో హడావుడి చేస్తున్నారు. ఆయన ఏ పథకం ప్రారంభించినా అందులో అవినీతి ఉంటుంది. ఇళ్ల పట్టాల స్కీంలోనూ  వేల కోట్ల అవినీతి చేశారు. 30 లక్షలమందికి ఇళ్లు ఇస్తామంటున్నారు. ఇందుకోసం 60 వేల ఎకరాల భూమి సేకరించారు. స్థల సేకరణ కోసం 22 వేల 355 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

ఇళ్ల పట్టాల పంపిణీలో ఏ1, ఏ2, కొందరు ఎమ్మెల్యేలు రూ. 6500 కోట్ల అవినీతి చేశారు. అవినీతిని నిరూపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలి. అవినీతి చేయడంలో జగన్మోహన్ రెడ్డి , అతనికి సలహాలు ఇవ్వడంలో విజయసాయి రెడ్డి ఘనులు. 10, 15 లక్షల విలువుండే భూమిని 40 లక్షలకు పైగా చెల్లించి కొనుగోలు చేశారు. ఇందులో భారీ అవినీతికి పాల్పడ్డారు. 

భూ సేకరణలో రేట్లు పెంచి సుమారు రూ. 4వేల కోట్లు దోపిడీ చేశారు. కొండలు, గుట్టలు, చెరువులు, స్మశానాల్లో భూములు సేకరించారు. ఆ భూమి చదును చేయడానికి మళ్లీ డబ్బు ఖర్చు పెట్టారు. అందులోనూ రూ. 2 వేల కోట్లు తినేశారు. భూమిలిస్తాం, పట్టాలిస్తామంటూ గ్రామాల్లోని వైసీపీ నేతలు, వాలంటీర్లు అమాయక ప్రజల దగ్గర రూ. 5 వందల కోట్లు వసూలు చేశారు.  

టీడీపీ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 8 లక్షల ఇళ్లు నిర్మించాం.వాటిని పేదలకు ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం ఇష్టపడటం లేదు. నర్సీపట్నంలో 2, 595 మందికి ఇళ్లు కేటాయిస్తే వాటిని తీసేసేందుకు చూస్తున్నారు.

నర్సిపట్నంలో 624 మంది డిపాజిట్ లు కట్టినా ఇళ్లు ఇవ్వడంలేదు. ఎందుకు ఇవ్వరంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇవ్వకపోవడానికి కారణాలు చెబుతూ నోటీస్ ఇచ్చారా? డిపాజిట్ కట్టిన వారికి ఇళ్లు కేటాయించాల్సిందే.

ప్రజా పోరాటం తప్పదు. టిడ్కో ఇళ్లకు లోన్ మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు. రూపాయికే ఇళ్లు అని మాయమాటలు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను ఇంతలా మోసం చేస్తారా? డిపాజిట్లు కట్టిన వారికి అన్యాయం చేస్తూ సంబరాలా?

మంత్రులు అవంతి, నారాయణ స్వామి తిరుమల కొండపై నుంచి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం సరికాదు. కొండపై అన్యమత ప్రచారం చేయకూడదని కోర్టులు కూడా చెప్పాయి. సంప్రదాయాలను కాపాడాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా? అవంతి శ్రీనివాస్ సమాధానం చెప్పాలి.