మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (07:16 IST)

సెటైర్లు వేయండి కానీ... పార్టీకి చెడ్డ పేరు తేవొద్దు: విజయసాయి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కర్నూలు, ప్రకాశం జిల్లాల సోషల్ మీడియా కార్యకర్తల ఆత్మీయ సమావేశం తాడేపల్లిలోని సిఎస్ఆర్ కళ్యాణమండపంలో జరిగింది. 

ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ముందుగా సోషల్ మీడియా కార్యకర్తల సమస్యలు, సూచనలు, సలహాలుసావధానంగా విన్న తర్వాత తాను ప్రసంగించారు. విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారంటే...
 
1. రాష్ట్రంలోని 13 జిల్లాలను జోన్లుగా విభజించి ఈ సోషల్ మీడియా కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఈ సమావేశాల ద్వారా సోషల్ మీడియా కార్యకర్తల సమస్యలు విని ఆకళింపు చేసుకుని వాటిని పరిష్కరించాలనే మా
ప్రయత్నం. మా ఆలోచనకు అనుగుణంగా ఈ సమావేశంలో సోషల్ మీడియా కార్యకర్తలు చాలా మంచి సూచనలు, సలహాలు ఇచ్చారు. అనేక ముఖ్యాంశాలు మా దృష్టికి తెచ్చారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావడానికి కీలకపాత్ర పోషించిన 13 జిల్లాల వారందరికీ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు తప్పక నెరవేరుస్తాం.
 
2. సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు కావాలని అడుగుతున్నారు. గుర్తింపు కార్డు ఉండాలని అడుగుతున్నారు. అది సమంజసమే. ప్రతి ఒక్కరూ ముందు రిజిస్టర్చే యించుకోండి. త్వరలోనే ప్రతి జిల్లాలో కమిటీల నియామకం చేపడతాం. ఆ తర్వాత ఐడీ కార్డులు మంజూరు చేస్తాం. వాటిని దుర్వినియోగం చేయకుండా... పార్టీకి చెడ్డపేరు తేకుండా పని చేయాలని విజ్ఞప్తి
 
4.ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు. ఎవరికీ అన్యాయం జరగనివ్వం.
 
5. నియోజకవర్గ స్థాయి కమిటీలు వేసి వర్క్ షాపులు నిర్వహించాలని మీ నుంచి మరో సూచన వచ్చింది. సోషల్ మీడియా కమిటీల నియామకం జిల్లాల పునర్విభజన ముందా లేక తర్వాతా అన్నది త్వరలో నిర్ణయించి ఏర్పాటు చేస్తాం. జిల్లా కమిటీల నియామకం తర్వాత నియోజకవర్గ స్థాయి కమిటీలు వేసి ఆ తర్వాత శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తాం.
 
6. 40 నుంచి 50లక్షల మంది ప్రజలకు చేరువ చేసే సోషల్ మీడియా కార్యకర్తలను నిర్లక్ష్యం చేసే ప్రసక్తే లేదు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మీ రోల్ ను విస్మరించే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యేలతో మాట్లాడి తగిన గుర్తింపు లభించేలా చర్యలు చేపడతాం.
 
7. సోషల్ మీడియా కార్యకర్తలు లీగల్ ఎయిడ్ కావాలని అడుగుతున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరికీ న్యాయ సహాయం అందజేయడం జరుగుతుంది.
 
8.  ఇలాంటి సమావేశాల ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుందాం.. చర్చించుకుందాం. పరిష్కరించుకుందాం.

రాజ్యసభ సభ్యులు, కర్నూలు, ప్రకాశం జిల్లా ఇన్ ఛార్జ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడారంటే.... పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక వహించిన సోషల్‌ మీడియా కార్యకర్తలను చిన్నచూపు చూసే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీ అందరికీ తప్పక న్యాయం చేస్తారు. గత ఎన్నికల్లో ఎలాగైతే పనిచేశారో... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే విధమైన కృషి, పట్టుదలతో పనిచేసి పార్టీ గెలుపుకు పాటుపడాలి.