శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 14 నవంబరు 2020 (15:11 IST)

త్వరలో పరిపాలనా రాజధానిగా విశాఖ: ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: జీవీఎంసీ ఆధ్వర్యంలో వాక్‌ధాన్ నిర్వహించడం సంతోషంగా ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆర్కే ‌బీచ్ నుంచి నిర్వహించిన స్వచ్ విశాఖ మారధాన్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విశాఖ త్వరలో పరిపాలన రాజధానిగా మరబోతుందని స్పష్టం చేశారు.
 
రాజధాని కాబోతున్న విశాఖ కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. నగరంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రమాదాల రహిత నగరంగా విశాఖను తీర్చిద్దితామని తెలిపారు. ప్రపంచంలోనే విశాఖ మంచి నగరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
 
విశాఖ నుంచి భీమిలి వరకు ఒక్క వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరిచేలా విశాఖను సుందరీకరిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.