బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 16 నవంబరు 2020 (20:24 IST)

17,18 తేదీలలో మంగళగిరిలో జనసేన పార్టీ సమావేశాలు

జనసేన పార్టీ క్రియాశీలక సమావేశాలు రెండు రోజులపాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్నాయి. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశాలలో పాల్గొంటారు. ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాలలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ అయిదు నియోజకవర్గాల సమీక్ష సమావేశం జరుగుతుంది. 
 
క్రియాశీలక సభ్యులకు పార్టీ అందిస్తున్న ఇన్సూరెన్సు సౌకర్యానికి సంబంధించి కొందరు సభ్యులకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా  ధ్రువపత్రాలను ప్రదానం చేస్తారు.
ఇదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం జరుగుతుంది.18వ తేదీ ఉదయం పది గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతికి చెందిన కొందరు మహిళా రైతులతో భేటీ అవుతారు. 
 
క్రియాశీలక సభ్యత్వం మరో 32 నియోజకవర్గాలలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి 32 నియోజకవర్గాల ఇంచార్జిలతో  11 గంటలకు సమావేశం అవుతారు. సభ్యత్వ నమోదు కోసం పార్టీ ఐ.టి.విభాగం రూపొందించిన యాప్ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను పరిశీలిస్తారు. ఈ రెండు సమావేశాలలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారు.