వలస కార్మికుల తరలింపుకు ప్రత్యేక ఏర్పాట్లు: మంగళగిరి తహసీల్ధార్
ఇతర రాష్ట్రాలు,ఇతర జిల్లాల నుంచి ఉపాధి కోసం వచ్చి కరోనా లాక్ డౌన్ వల్ల మంగళగిరి లోనే నిలిచి పోయిన వలస కార్మికులను తమ స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంగళగిరి తహసీల్ధార్ రామ్ ప్రసాద్ అన్నారు.
ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన సుమారు 3 వేల మందికి పైగా వలస కార్మికులు ఉన్నారని వారి వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.స్వస్థలాలకు వెల్లాలనుకునే వలస కార్మికులు 1902 కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని సూచించారు.
కొందరి వివరాలు రావాల్సి ఉందని వీ ఆర్ ఓ ల ద్వారా అటువంటి వారి సమాచారాన్ని 1902 ద్వారా నమోదు చేయించి త్వరితగతిన తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామని తహసీల్ధార్ స్వష్టం చేశారు.