శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (07:32 IST)

జగన్మోహన్ రెడ్డి జీవితమంతా అబద్ధాలు, మోసాలే: అయ్యన్నపాత్రుడు

జగన్మోహన్ రెడ్డి జీవితమంతా అబద్ధాలు, మోసాలతోనే గడిచిపో తోందని, చిన్నప్పుడు చదువులో గట్టెక్కడానికి మోసం, సంపాదన కోసం తల్లిదండ్రులను మోసగించడం చేసిన ఆయన, చివరకు తండ్రి చనిపోయినప్పుడు, ముఖ్యమంత్రి పదవికోసం ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించడంద్వారా పదవికోసం ఘరానా మోసానికి పాల్పడ్డాడని టీడీపీ సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టంచేశారు. ఆయన తనమీడియాసందేశాన్ని వీడియో రూపంలో విలేకరులకు పంపించారు. అందులోని వివరాలు  ఆయన మాటల్లోనే ...! 
 
పాదయాత్రలో అడుగడుగునా అబద్ధాలు చెప్పి, ముఖ్యమంత్రి అయిన జగన్, పదవిలోకి వచ్చాకకూడా తనపద్ధతి మార్చుకోలేదు. మాటతప్పను, మడమ తిప్పను అంటూనే అనేకసార్లు జగన్ మాటతప్పి, మడమతిప్పాడు. ఆ విషయం గురించి ఆయనే ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఇసుక లేకుండాచేసి, కృత్రిమకొరత సృష్టించి, భవననిర్మాణ కార్మికులను బలితీసుకున్నాడు. రాష్ట్రంలో  నిర్మాణ రంగాన్ని నిర్వీర్యంచేశాడు.

విద్యుత్ ఛార్జీలు పెంచడంద్వారా ప్రజల కడుపుకొట్డాడు. చంద్రబాబు హాయాంలో మీటర్లు గిర్రునతిరుగుతున్నాయంటూ, ఆనాడు అభాండాలు వేసిన జగన్, నేడు కరోనాసమయంలో ప్రజలుకష్టాల్లో ఉన్నారని కూడా చూడకుండా విద్యుత్ ఛార్జీలు దారుణంగా పెంచాడు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంద్వారా ప్రజలపై అదనపు భారం మోపాడు.

రోడ్ల సెస్సు అంటూ, లేనిరోడ్లపేరుచెప్పి చమురుధరలు పెంచి, ప్రజలనుంచి దోచుకుంటున్నాడు. మద్యం ధరలు పెంచడం, కల్తీమద్యం అమ్మకాలతో సంపాదనే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యంతో జగన్మోహన్ రెడ్డి ఆటలాడుకుంటున్నాడు. అమ్మఒడి పేరుతో తల్లులకు డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి, నాన్నజేబు ద్వారా తిరిగి, తనజేబులోకే ఆ సొమ్మంతా వచ్చేలా చేసుకున్న బడా వ్యాపారి జగన్మోహన్ రెడ్డి. జగన్ చేతగానిపాలన కారణంగా ప్రతిఊరిలో నాటుసారా అమ్మకాలు, గంజాయి విక్రయాలు సాగుతున్నాయి.

తన సంపాదనకోసం పేదలను మత్తులో ముంచితేలుస్తున్నాడు.  గతప్రభుత్వంలో పేదలు నిర్మించుకున్న ఇళ్లనువారికి ఇవ్వకుండా, వారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్నాడు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గతప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వారికి, నిధులు చెల్లించకుండా, పనులుచేసినవారి ఉసురు తీసుకునేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. 

సెంటు పట్టా పేరుతో , ఇళ్లస్థలాలు ఇస్తున్నామంటూ కనీవినీ ఎరుగనిరీతిలో దోపిడీకి తెరతీసిన జగన్ ప్రభుత్వం, విజయసాయి ఆధ్వర్యంలో విశాఖలో భూములుకబ్జా, భూదోపిడీని యథేచ్ఛగా సాగిస్తోంది. మహానగరాలతో పాటు, పల్లెల్లోకూడా వైసీపీనేతలు భూదోపిడీ కొనసాగిస్తున్నారు. విజయనగరం జిల్లాలోని, నర్సీపట్నం నియోజకవర్గంలోని తూటుపాలెం గ్రామంలో, భూముల దోపిడీ వైసీపీనేతల కన్నుసన్నల్లోనే సాగుతోంది.

ఈ విషయం ప్రభుత్వానికి, విజయసాయికి తెలియదా? ఇవన్నీ ఇలాఉంటే, మరలా కొత్తగా ఎప్పటికప్పుడు ప్రజలను మోసగిస్తూనే ఉన్నారు. వైఎస్సార్ సున్నావడ్డీ పంటల రుణపథకం పేరుతో రైతులను మరీ దారుణంగా మోసగించడానికి జగన్ సిద్ధమయ్యాడు. పత్రికల్లో తన ఏడుపుగొట్టు ఫొటోలు వేసి, పెద్దపెద్ద ప్రకటనలిచ్చి, ఏదోచేస్తున్నట్లు రైతులను దారుణంగా మోసగిస్తున్నారు.

వైసీపీఎన్నికల మేనిఫేస్టోలో రైతులందరికీ రుణాలపై వడ్డీని మాఫీచేస్తానని చెప్పిన జగన్, ఆనాడు ఎక్కడా ఎలాంటినిబంధనలు పెట్టలేదు. నేడు అధికారందక్కగానే, రైతులకుచేసే సాయంలో అన్నీ షరతులే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన షరతులు కారణంగా కేవలం 20  నుంచి 30శాతం మంది రైతులకు మాత్రమే లబ్దికలుగుతుంది. 100 మందిలో 70మందికి మరలా ఎప్పటిలానే శఠగోపం పెట్టాడు.  
 
రాష్ట్రంలోని రైతుసంఘాలు, రైతునేతలు కూడా జగన్ రైతులను మోసగిస్తున్న తీరుని గురించి అన్నదాతలకు తెలియచేయడం లేదు. రూ.లక్షలోపు రుణం తీసుకొని, ఎవరైతే సకాలంలో చెల్లిస్తారో, వారికి మాత్రమే సున్నావడ్డీపథకం అమలవుతుందని జగన్ షరతు పెట్టాడు.

రూ.లక్షపైన, రూ.లక్షా 5వేలుతీసుకున్న వారికి కూడా ఈ పథకం వర్తించదు. అలా చూస్తే, రాష్ట్ర రైతాంగంలో కేవలం 20 నుంచి 30 శాతం మందిమాత్రమే జగన్ ప్రవేశపెట్టిన పథకంకింద లబ్ది పొందుతారు.   ఈ విధంగా రైతులను మోసగిస్తే, జగన్ కు పుట్టగతులుండవు. ఆయనకు ఎవరు ఇటువంటి సలహాలు ఇస్తున్నారో తెలియడంలేదు. సీనియర్ మంత్రులు, సలహాదారులు జగన్ చుట్టూఉన్నాకూడా ఆయన వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా లేదు. 

భూములు రీసర్వే పేరుతో పాతే రాళ్లపై జగన్ బొమ్మలు వేయడం చూస్తుంటే, అవి సర్వేరాళ్లా లేక సమాధిరాళ్లా అన్న అనుమానం కలుగుతోంది. ఒక్కో రాయిఖరీదు రూ.5,500లుగా నిర్ధారించినప్రభుత్వం, రూ.990కోట్లతో భూములరీసర్వే పథకాన్ని అమలుచేయడానికి సిద్ధమైంది. ఆరాళ్లను చూస్తుంటే జనం నవ్వుతున్నారు.

కనీసం ఏంచేస్తున్నామనే జ్ఞానం కూడా లేకుండా ముఖ్యమంత్రి వ్యవహరిస్తే ఎలా? విజయసాయిరెడ్డి మాటలు విని జగన్ ఇలాచేస్తే,  అంతిమంగా నష్టపోయేది ముఖ్యమంత్రే. జగన్ కు విజయసాయి శకునిమామ అని, శకుని మాటలు విని నష్టపోవడం తప్ప, బాగుపడినవారు లేరనే విషయం జగన్ గ్రహిస్తే మంచిది. జగన్,  విజయసాయిరెడ్డిని నమ్మితే, పోలవరం ప్రాజెక్టు వద్ద ఏదోఒక గోతిలో ముంచేయడం ఖాయం. 

ఈ విధంగా ఏంచేస్తున్నాడో కూడా తెలియకుండా, జగన్ ప్రజలను మోసగిస్తూనేఉన్నాడు. ఇప్పటికైనా జగన్ ఒకసారి తనభార్యా,తల్లితో కలిసి కూర్చొని,  18నెలలపాలనలో ఏంచేశాడో ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. శకునిమామ మాటలు వింటే అంతేసంగతులని జగన్ గ్రహించాలి.

తనతీరు మార్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగానే పాలన సాగిస్తే, దారుణంగా నష్టపోతాడు. పోలవరం ఎత్తుతగ్గించడం, పెంచడం జగన్ ఇష్టంకాదు. అటువంటి ఆలోచనలు విరమించు కోకుంటే ఉత్తరాంధ్రచరిత్రలో జగన్ ఎప్పటికీ ద్రోహిగానే మిగిలిపోతాడు.

గతంలో పోలవరం నిర్మాణం కోసం, కేంద్రం మెడలు వంచి నిధులు తెస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, నేడు కేసుల  భయంతో నోరెత్తడంలేదు. చంద్రబాబునాయుడు పోలవరం పనులు చేయిస్తున్నప్పుడు, కేంద్రం నిధులివ్వకపోతే, రాష్ట్రప్రభుత్వ నిధులతో పనులుచేయొచ్చుకదా అని విమర్శలు చేసిన జగన్, నేడు ఆవిధంగా ఎందుకు చేయలేకపోతున్నాడు.

ప్రాజెక్ట్ నిలిచిపోయిందని జనమంతా ఏడుస్తుంటే, అక్కడ తనతండ్రి విగ్రహం పెట్టాలని చూడటం ఏమిటి? జగన్ తనతండ్రి విగ్రహం పెడతానంటే, బీజేపీనేత సోము వీర్రాజు మోదీ విగ్రహం పెడతానని చెప్పడం సిగ్గుచేటు. అలా మాట్లాడటానికి ఇద్దరికీ సిగ్గుండాలి.  ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తనతీరు మార్చుకుంటే మంచిది.