శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 22 మార్చి 2021 (22:06 IST)

ఇంటి లోను కట్టాలంటూ బ్యాంకు బెదిరింపు, గుండెపోటుతో వ్యక్తి మృతి

హనుమాన్ జంక్షన్ గాంధీ కో-ఆపరేటివ్ బ్యాంకులో వీరవల్లి గ్రామానికి చెందిన ఇలపర్తి సుధీర్ కుమార అలియాస్ పండు వాళ్ళ నాన్న గారు 2016 సంవత్సరంలో గృహ రుణం నిమిత్తం 7 లక్షల రూపాయలు తీసుకున్నారు. రుణం తీసుకున్న సంవత్సరానికే తండ్రి చనిపోవడంతో రెండు సంవత్సరాల నుంచి ఇలపర్తి సుధీర్ కుమార అలియాస్ పండు 
బ్యాంకు రుణం వడ్డీ కట్టుకుంటు వచ్చారు.
 
కరోనా లాక్ డౌన్ కారణంగా రుణ వాయిదా కట్టలేక పోయారు. ఇదిలా వుండగా గత శుక్రవారం రుణ వాయిదా కట్టలేని కారణంగా ఇళ్లు ఖాళీ చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులు బెదిరింపులు చేయడంతో మానసిక ఒత్తిడికి గురై అదే రోజు ఇలపర్తి సుధీర్ కుమార్ అలియాస్ పండు గుండెపోటుతో మరణించాడు.
 
కుటుంబానికి అధారంగా ఉంటాడని అనుకున్న ఒక్కగాని ఒక్క కొడుకుని కోల్పోయామని, ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నామని తమకు న్యాయం చేయాలంటూ వీరవల్లీ పోలీసు స్టేషన్లో తల్లి జయప్రద ఫిర్యాదు చేశారు.