సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 6 అక్టోబరు 2017 (17:07 IST)

భూమా బ్రహ్మానందరెడ్డి ప్రమాణ స్వీకారం

అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ ఉప ఎన్నికల్లో ఎన్నికైన భూమా బ్రహ్మానందరెడ్డి ఏపీ శాసనసభ ప్రాంగణంలోని స్పీకర్ చాంబర్‌లో శుక్రవారం ఉదయం శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు బ్రహ్మానందరెడ్డి చేత ప్రమాణస

అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ ఉప ఎన్నికల్లో ఎన్నికైన భూమా బ్రహ్మానందరెడ్డి ఏపీ శాసనసభ ప్రాంగణంలోని స్పీకర్ చాంబర్‌లో శుక్రవారం ఉదయం శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు బ్రహ్మానందరెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఆయన దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. 
 
అనంతరం శాసనసభ నియమనిబంధనల పుస్తకాల బ్యాగ్‌ని స్పీకర్ ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, భూమా అఖిలప్రియ, శాసనసభ ఇన్‌ఛార్జి కార్యదర్శి విజయరాజు, డిప్యూటీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.