బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మే 2022 (16:35 IST)

చింత‌మ‌నేనికి హైకోర్టులో ఊరట-తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ స్టే

chintamaneni prabhakar
చింత‌మ‌నేనిపై న‌మోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో టీడీపీ సీనియ‌ర్ నేత‌, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌కు బుధ‌వారం హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు స్టే విధించింది. 
 
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీల‌కు నిర‌స‌న‌గా టీడీపీ 'బాదుడే బాదుడు' పేరిట నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. ఈ నిర‌స‌న‌ల్లో భాగంగా పాల్గొన్న సంద‌ర్భంగా చింత‌మ‌నేని ఘాటు వ్యాఖ్య‌లు చేశారంటూ చింత‌ల‌పూడి పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా చింత‌మ‌నేనిపై చింత‌ల‌పూడి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు. 
 
ఈ కేసును స‌వాల్ చేస్తూ చింత‌మనేని హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌పై బుధవారం నాడు విచార‌ణ చేప‌ట్టిన కోర్టు... ఈ కేసులో త‌దుప‌రి చర్య‌లు చేప‌ట్ట‌వద్దంటూ స్టే విధించింది.