బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2017 (08:57 IST)

అగ్రిటెక్-2017 సదస్సుకు బిల్ గేట్స్...

విశాఖపట్టణంలో జరుగుతున్న అగ్రిటెక్ 2017 సదస్సుకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ హాజరుకానున్నారు. ఈ సదస్సు శుక్రవారంతో ముగియనుంది. మూడు రోజుల క్రితం ఈ సదస్సును భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ప్రా

విశాఖపట్టణంలో జరుగుతున్న అగ్రిటెక్ 2017 సదస్సుకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ హాజరుకానున్నారు. ఈ సదస్సు శుక్రవారంతో ముగియనుంది. మూడు రోజుల క్రితం ఈ సదస్సును భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభించిన విషయం తెల్సిందే. 
 
మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్సు ముగింపు కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్‌ అధిపతి బిల్‌ గేట్స్‌ పాల్గొని కీలకోపన్యాసం చేయనున్నారు. కాగా, రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న బిల్‌ గేట్స్‌కు స్వాగతం పలికేందుకు ఏపీ సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండిమరీ ఏర్పాట్లకు పర్యవేక్షిస్తున్నారు. అగ్రిటెక్‌ సదస్సు ముగింపు కార్యక్రమంలో చంద్రబాబుతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గోనున్నారు. 
 
కాగా, ఈ సదస్సులో భాగంగా రెండోరోజైన గురువారం జరిగిన సదస్సులో చంద్రబాబు నదుల అనుసంధానంపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గురించి వివరించారు.