ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2017 (12:44 IST)

వైజాగ్‌లో ఏలియన్ పక్షులు ఏం తింటున్నాయో తెలుసా?

వైజాగ్ వన్ టౌన్లో ఏలియన్ పక్షులు కనిపించాయని.. ఆ పక్షులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పక్షులకు పళ్లు, కూరగాయలు తెచ్చిపెడుతున్నా వాటిని అవి తినడం లేదట. తల్లి పక్షి తెచ్చి పెట్టే ఆ

వైజాగ్ వన్ టౌన్లో ఏలియన్ పక్షులు కనిపించాయని.. ఆ పక్షులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పక్షులకు పళ్లు, కూరగాయలు తెచ్చిపెడుతున్నా వాటిని అవి తినడం లేదట. తల్లి పక్షి తెచ్చి పెట్టే ఆహారాన్ని తప్ప మిగిలిన ఆహారాన్ని ఏమాత్రం ముట్టుకోవట్లేదట. విశాఖలో మూడు ఏలియన్ పక్షులు కనిపించాయని.. గ్రహాంతరవాసుల్లా ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 
 
వైజాగ్ వన్ టౌన్‌లో పాతపోస్టాఫీసుకు దగ్గర్లో పోలీస్ స్టేషన్ పక్కనే ఒడిశా స్టీవ్ డోర్స్ లిమిటెడ్ అనే షిప్పింగ్ కంపెనీ ఉంది. కార్యాలయం నుంచి దుర్వాసన రావడంతో...ఆ కంపు భరించలేక, ఎక్కడ ఎలక చచ్చిందోనని వెతకడం ప్రారంభించారు. దీంతో వారికి బాత్రూమ్ పైనున్న రూఫ్ మీద, స్లాబు కింద చిత్రమైన పక్షులు కనిపించాయి. వాటిని చూస్తే ముందు గుడ్లగూబలుగా భావించారు. 
 
కానీ కాళ్లు వుండటం పెద్దగా శబ్ధం చేయడాన్ని గమనించి.. వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆపై ఆ సంస్థ జనరల్ మేనేజర్ జేకే నాయక్ వాటికి పళ్లు, కాయగూరలు తెచ్చిపెట్టడం ప్రారంభించారు. అయితే అవి వాటిని ముట్టడం లేదట. బాత్రూమ్‌కి ఉన్న రంధ్రంలోచి ఆ ఏలియన్ పక్షుల తల్లి బయటకు వెళ్లి ఏదో ఆహారం తెస్తోందని, దానిని మాత్రమే తింటున్నాయని జేకే నాయక్ అన్నారు. ఇకపోతే.. వైజాగ్‌లో కనిపించిన ఏలియన్ పక్షులు యూరప్, బ్రిటన్‌లో కనిపిస్తాయని, ఇవి గుడ్లగూబ తరహా పక్షులని పరిశోధకులు అంటున్నారు.