ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:44 IST)

హిందువుల మనోభావాలను కించపర‌చొద్దంటూ...బీజేపీ ధర్నా

హిందువుల మనోభావాలను కించపరుస్తూ, గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోకుండా జీవో  తీసుకురావడం హిందూ వ్యతిరేక చర్యగా బిజెపి పేర్కొంది. ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ, బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ జిల్లా ఆధ్వర్యంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం ధర్నా నిర్వహించారు. వర్షాన్నిసైతం లెక్కచేయకుండా, రాజమండ్రి జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, హిందూ అభిమానులు పాల్గొన్నారు. 
 
రాజమండ్రి  జిల్లా బిజెపి అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో నిత్యం రద్దీగా ఉండే మద్యం షాపులు, పాఠశాలలు , సినిమా థియేటర్లు తెరిచిన ప్రభుత్వం, ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే గణపతి నవరాత్రుల విషయంలో జీవో ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి హిందువుల మనోభావాలను  కించపరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. 
 
కోవిడ్ నిబంధనలతో గణపతి నవరాత్రులు జరుపుకోవడానికి వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేసారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్ముల దత్తు , ఓబీసీ మోర్చా జోనల్ ఇంచార్జి కురగంటి సతీష్ , ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలెపు సత్యసాయిరామ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి లు గుర్రాల వెంకట్రావు, పిక్కి నాగేంద్ర, లలిత్ కుమార్ జైన్, ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షుడు పినిపే గంగరాజు, కిసాన్ మోర్చా అధ్య క్షుడు సత్యకుమార్, బీజేపీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ , జిల్లా ఉపాధ్యక్షుడు బూర రామ చంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.