శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (10:05 IST)

బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర.. 36 రోజుల పాటు పాదయాత్ర

బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర శనివారం నుంచి ప్రారంభం కానుంది. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి.. పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. అక్టోబర్‌ 2వ తేదీ వరకు 36 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది.
 
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్, ఇతర ముఖ్య నేతలు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 
 
ఇక బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర నాలుగు విడతల్లో కొనసాగనుంది. మొదటి విడత పాదయాత్ర అక్టోబరు 2న హుజూరాబాద్ లో ముగించేలా ప్రణాళిక రూపొందించారు. 
 
ఈ పాదయాత్ర రోజుకు పది కిలోమీటర్లు కొనసాగనుంది. కాగా, శనివారం ప్రారంభం కానున్న ప్రజా సంగ్రామ యాత్ర తొలి రెండ్రోజులు హైదరాబాద్ పరిధిలోనే జరగనుంది.