బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:21 IST)

ఈనాడు విలేఖరిపై విచారణ జరిపించాలని క‌డియం గ్రామ‌స్తుల‌ ధర్నా

ఆధార్ కేంద్రంలో అవినీతికి పాల్పడుతున్న ఈనాడు విలేఖరి దుప్పలపూడి శ్రీనివాస్ పై విచారణ జరిపించాలని కడియం మండలానికి చెందిన పలు గ్రామాల భాదితులు సోమవారం ఆందోళన చేశారు. కడియంలో ర్యాలీగా బయలుదేరి తాహ‌సిల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

జర్నలిజాన్ని అడ్డుపెట్టుకుని ఆధార్ కేంద్రానికి వచ్చిన నిరుపేదలను ఈనాడు విలేఖరి దోపిడీ చేస్తున్నాడని, దళిత గిరిజన పోరాట సమితి వ్యవస్థాపకుడు, న్యాయవాది చింతపర్తి రాంబాబు అన్నారు. అతనిపై చర్య తీసుకోవాల‌ని, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

దుప్పలపూడి శ్రీనివాస్ పై రాజానగరం పోలీస్ స్టేషన్ లో చీటింగ్, మోసం(420,506) కేసు నమోదయింద‌ని, ఆ కేసుల్లో పోలీసులు అరెస్టు కూడాఆ చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆ కేసు కోర్ట్ లో పెండింగ్ లో ఉంద‌ని రాంబాబు వెల్లడించారు. యూనియన్ బ్యాంకు ఆధార్ కేంద్రంపై ఎసీబీ అధికారులతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

అనంతరం డిప్యూటీ తశీల్దార్ కె. శ్రీదేవి కి నిరసనకారులంతా వినతి పత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో దుళ్ళ, వేమగిరి, వీరవరం, దామిరెడ్డిపల్లి, కడియం, కడియపులంక, జేగురుపాడు, కడియపుసావరం గ్రామాల నుండి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.