శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 10 మే 2017 (14:55 IST)

బిజెపి అండతోనే తితిదే కొత్త ఈవో నియామకం...?

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారి వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతోంది. ఉత్తరాదికి చెందిన వ్యక్తిని ఈవోగా నియమించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మఠాధిపతులు, పీఠాధిపతులు, సినీనటులు. దక్షిణాది ప్రాంత వాసినే ఈవోగా నియమించ

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారి వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతోంది. ఉత్తరాదికి చెందిన వ్యక్తిని ఈవోగా నియమించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మఠాధిపతులు, పీఠాధిపతులు, సినీనటులు. దక్షిణాది ప్రాంత వాసినే ఈవోగా నియమించాలన్నది వారి డిమాండ్. ఇదిలావుంటే తితిదే ఈఓ పోస్టింగ్ కోసం ప్రస్తుత ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తీవ్రంగా పోటీపడినట్లు తెలుస్తోంది. సీనియర్ ఐఎఎస్‌లను కాదని, అనిల్‌కు ఈఓ పదవి ఇవ్వడానికి ప్రధాన కారణం బిజెపి అగ్రనేతలేనని తెలుస్తోంది. అందులోను అమిత్ షానే స్వయంగా ఈఓ పదవి కోసం ఎపి ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు తెలుస్తోంది.
 
టిటిడి ఈవో పదవి అంటేనే చాలామంది ఎగిరి గంతేస్తారు. అలాంటిది ప్రస్తుతం ఈవోగా ఉన్న జూనియర్ ఐఎఎస్ ఆ పదవి కోసం తీవ్రంగా పోటీపడ్డారట. ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌కు బిజెపి అగ్ర నేతలతో మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయట. ఏకంగా అనిల్ అమిత్ షాతోనే మాట్లాడగలరంట. అందుకే ఆయన నేరుగా తనకు తితిదే ఈఓ పదవి కావాలని ఆయన్ను అడగడంతో వెంటనే ఆ పదవిలో కూర్చోబెట్టడానికి అమిత్ షా సిద్ధపడి చంద్రబాబుకు ఆ విషయం తెలిపారట. అమిత్ షా చెబితే ఇక ఎదురేముంటుంది..? కాగా కొత్త ఈవోను బదిలీ చేయాలని చాలామంది పట్టుబడుతున్నారు.