ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 27 జనవరి 2022 (15:02 IST)

ఎన్టీయ‌ర్ జిల్లా... మా నాన్న పేరు పెట్ట‌డం, బిడ్డ‌గా స్వాగ‌తిస్తున్నా...

మహనీయుడు నందమూరి తారక రామారావు పుట్టిన జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లా అని పేరు పెట్టడాన్ని ఆయన బిడ్డగా తాను స్వాగతిస్తున్నట్టు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందేశ్వరి తెలిపారు. ప్రజాభీష్టం ఈ నాటికి నెరవేరిందని బుధవారం ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లాగా పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గెజిట్‌ కూడా విడుదలైంది.  
 
 
త‌న పాద‌య‌త్ర సందర్భంగా నాడు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాటను తు.చ. తప్పకుండా నిలబెట్టుకున్నారంటూ కృష్ణా జిల్లా వాసులు. దీనికి ఎన్టీఆర్‌ అభిమానులు ఎంతగానో సంబరపడుతున్నారు. నిమ్మకూరులోని నందమూరి కుటుంబీకులూ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. విలువలు, విశ్వసనీయతకు మారుపేరైన నాయకుడు జగనే అంటూ కొనియాడుతున్నారు. ఈ సంద‌ర్భంగా తొలుత‌గా ఎన్టీయార్ కుమార్తె పురంధేశ్వ‌రి ఈ విషయంపై స్పందించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని అభినందించారు.