శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 8 జనవరి 2022 (15:04 IST)

రియ‌ల్ ఎస్టేట్ లోనూ జ‌గ‌న్ వేలు... మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కి ప్రభుత్వ లేఅవుట్!

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అన్ని రంగాల‌లోనూ వేలు పెడుతోంది. చివరికి రియ‌ల్ ఎస్టేట్ లోనూ ప్ర‌భుత్వం ప్ర‌వేశించింది. మిడిల్ ఇన్క‌మ్ గ్రూప్ కి ప్ర‌భుత్వం లే అవుట్ వేస్తోంద‌ని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి చెప్పారు. 
 
 
నవులూరు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పక్కన ఉన్న సిఆర్ డి ఎ స్థలాలను పరిశీలించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇక్క‌డ మ‌ధ్య‌త‌ర‌గ‌తికి అపార్ట్ మెంట్లు క‌ట్టిస్తామ‌న్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్, సిఆర్డిఏ కమిషనర్, జాయింట్ కలెక్టర్, ఎంటిఎంసి అధికారులు ఎమ్మెల్యే వెంట వ‌చ్చారు.
 
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ, సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు పేదలు అందరికీ ఇళ్ల పథకంలో అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తున్నార‌ని పేర్కొన్నారు. అలాగే మధ్యతరగతి వారికి కూడా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ (MIG) వారికి ప్రభుత్వం లే ఔట్ ఏర్పాటు చేసి ఎటువంటి లాభాలు లేకుండా రోడ్స్, వాటర్, డ్రైన్స్, విద్యుత్, పార్కులు వంటి సకల సౌకర్యాలతో ఫ్లాట్ లు అందుబాటులోకి తీసుకురావాలని సంక‌ల్పించార‌ని చెప్పారు. ఈ నెల 13న సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ఎం.ఐ.జి పథకాన్ని ప్రకటించనున్నారని, మధ్యతరగతి వారందరూ ఈ పథకం ద్వారా సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని అన్నారు.
 
 
నవులూరులో ఏర్పాటు చేసిన ఈ లేఅవుట్ నేషనల్ హైవేకి కిలో మీటర్ దూరంలోనూ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ప్రక్కన, అతి చేరువలో రైల్వే స్టేషన్, 1.5 కిలోమీటర్ల దూరంలో విజయవాడ వెళ్లడానికి పాత నేషనల్ హైవే ఉందని వివ‌రించారు. ఇలా అన్ని సౌకర్యాలు అతిచేరువలో ఉన్నాయని అన్నారు. ఎంఐజి పథకంలో ప్రభుత్వ ఉద్యోగులకు 10+20= 30% రాయితీ కూడా ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. ఈ లేఔట్ వలన నవులూరు గ్రామం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు.