సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : బుధవారం, 12 జూన్ 2019 (20:33 IST)

విద్యార్థినికి ఆ వీడియోలు చూపించాడు.. తనూ చేస్తూ వీడియో తీసి స్నేహితులకు పంపితే..

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనపాకం గ్రామంలో ఓ మైనర్ బాలికను అసభ్యంగా వీడియోలను తీసి, లైంగింకంగా దాడులు చేయడంతో  బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో గ్రామంలో విషయం తెలియడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
 
చంద్రగిరి మండలం పనపాకంకు చెందిన ఓ బాలిక చంద్రగిరి శ్రీపద్మావతి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతూ చంద్రగిరి వసతి గృహంలో ఉంటుంది. తల్లి చనిపోవడంతో తండ్రి వికలాంగుడు కావడంతో తన నానమ్మ దగ్గర ఉంటూ జీవనం సాగిస్తుంది. వేసవి సెలవుల సందర్భంగా బాలిక తన స్వగ్రామానికి వెళ్ళింది. 
 
బాలిక స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన మోహన్ అనే బాలుడు తన సెల్ ఫోన్‌తో ఆమె స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించాడు. ఈ దృశ్యాలను బాలికకు చూపి బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక మోహన్ తన స్నేహితులైన నాగార్జున, పార్థసారధి అలియాస్ సీతయ్య, చక్రవర్తి, జగపతి అనే నలుగురికి ఈ దృశ్యాలను షేర్ చేశాడు.
 
వీటిని చూసిన ఆ యువకులు ఈ బాలికను తమతో గడపాలని లేకపోతే పేస్ బుక్‌లో పెడతామని లైంగికంగా వేధించారు. వీళ్ల బెదిరింపులు తాళలేక మనస్థాపానికి గురైన బాలిక తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీనిని గమనించిన బాలిక నానమ్మ ఆ బాలికను వారించి ఏం జరిగిందని ఆరా తీసింది. దీంతో జరిగిన విషయాలు తన నానమ్మకు తెలిపింది. గ్రామస్తుల సహకారంతో బాలిక నాన్నమ్మ చంద్రగిరి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్బయ చట్టం క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.