బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీసి...

శ్రీ| Last Modified బుధవారం, 12 జూన్ 2019 (10:38 IST)
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనపాకంలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక స్నానం చేస్తుండగా ఆ దృశ్యాలను చిత్రీకరించి లైంగింక దాడికి పాల్పడ్డారు నలుగురు యువకులు. దీంతో ఆ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

వివరాలు పరిశీలిస్తే పనపాకం గ్రామానికి చెందిన సరిత ( పేరు మార్చాం) చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో సరిత సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. స్కూల్‌కి సెలవులు కావడంతో పనపాకంలో నాయనమ్మ ఇంటికి వచ్చింది. సరిత స్నానం చేస్తుండగా మోహన్ అనే మైనర్ బాలుడు తన సెల్‌ఫోన్‌తో
వీడియో తీసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అంతేకాదు మోహన్ తన నలుగురు స్నేహితులకు ఆమె ఫోటోలను షేర్ చేశాడు. వీటిని చూసిన ఆ యువకులు ఈ బాలికను లైంగికంగా వేధించారు. తమకు సహరించకపోతే ఫేస్ బుక్‌లో పెడతామని బెదిరించారు. వారి వేధింపులు తాళలేక ఆమె ఉరి వేసుకొని చనిపోవాలని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇరుగుపొరుగువారు గమనించి సరైన సమయంలో ఆమెను కాపాడటంతో ప్రాణాలతో బయటపడింది. కాగా ఈ దారుణానికి ఒడిగట్టిన ఐదుగురు యువకులను అరెస్టు చేసిన ఖాకీలు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.దీనిపై మరింత చదవండి :