గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 10 జూన్ 2019 (22:33 IST)

అబ్బాయిలు బరువు తగ్గేందుకు చిట్కాలు...

ప్రస్తుతకాలంలో శారీరకంగా కానీ, మానసికంగా కానీ, యుక్త వయసులో ఉన్న అబ్బాయిలు నిరంతరంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. చదువుకోవడానికి వారి ఇంటిలో కానీ, పాఠశాలలో కానీ ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి ఒత్తిడి వలన వారు తినే ఆహరం మీద శ్రద్ధ పెట్టకపోవడం వలన అధిక బరువు లేక ఊబకాయం వస్తుంది. కావున భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి వయసుకు తగ్గ బరువుతో పెరగాలి. ఇలా అధిక బరువు ఉన్న అబ్బాయిలు కొన్ని చిట్కాలు పాటిస్తే బరువు తగ్గవచ్చు. అలాంటి కొన్ని చిట్కాలు.
 
బర్గర్లు, పిజ్జాలు మరియు నూనెతో చేసిన వంటలు పూర్తిగా తగ్గించాలి. ఎప్పుడైనా ఒకసారి తింటే ఫర్వాలేదు, కానీ ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఎక్కువగా పండ్లు, కూరగాయలు, ఐరన్, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహరం తీసుకుంటే ఆరోగ్యంగా, మంచి బరువుతో ఉంటారు. నీటి సేకరణ కూడా ఎక్కువగా జరపాలి. మంసాహారాలు మరియు నూనె వంటలు తినడం వలన బరువు ఎక్కువై, కొవ్వు పెరిగి ఊబకాయానికి దారి తీస్తుంది.
 
ఆరోగ్యానికి తగిన ఆహరం తీసుకొని, వ్యాయామం చేయడం వలన శరీరం చాలా ఒత్తిడికి గురవుతుంది మరియు శరీరం నీరసంగా మారుతుంది. కావున వ్యాయామం తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. ఈ విశ్రాంతి వలన మనసు, శరీరం తేలికపడుతుంది. అంతేకాకుండా, కండరాలు కూడా బలోపేతంగా అవుతాయి.
 
బరువు తగ్గాలంటే తక్కువగా లేక మితంగా తినాలి, కానీ అబ్బాయిలు తక్కువ బరువుతో పరిపూర్ణ శరీరం కావాలంటే వ్యాయామం చేయడం తప్పనిసరి. ఆరోగ్యకరమైన ఆహరంతో పాటు తగిన వ్యాయామం చేయాలి. కార్డియో, ఏరోబిక్ మరియు కండరాలని బలోపేతం చేసే వ్యాయామాలు చేసినట్లయితే బరువు తగ్గి, మంచి శరీరం మీ సొంతమవుతుంది. 
 
ఇలాంటి వ్యాయామాలు చేసే సమయాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడాలి.  ప్రతిరోజు వ్యాయామం చేస్తేనే తగిన ఫలితం ఉంటుంది. చిన్న వయసులో ఉన్న అబ్బాయిలు ఎవరైనా విమర్శించటం వలన మానిసికంగా బాధపడతారు. తల్లితండ్రులు మంచి ఉదాహరణలతో మరియు సలహాలతో పిల్లలని బరువు తగ్గడానికి ప్రోత్సహించాలి అంతేకానీ విమర్శించకూడదు.