గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By మోహన్
Last Updated : బుధవారం, 29 మే 2019 (18:30 IST)

అల్సర్‌కు చెక్ పెట్టే నెయ్యి?

బరువు తగ్గాలనుకునే వారు ఆహార విషయంలో చాలా నియమాలు పాటిస్తుంటారు. ఇవి తినాలి.. అవి తినొద్దు అంటూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఇందులోభాగంగానే నెయ్యి వాడకాన్ని బాగా తగ్గిస్తారు. అయితే నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతారనేది కేవలం అపోహ మాత్రమేనంటూ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నెయ్యిలో గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. 
 
ఇది ఆరోగ్యానికి ఎంతో మేలును చేకూర్చుతుంది. రోజూ తినడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతుంది. అయితే రోజుకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్‌లు మాత్రమే నెయ్యిని వాడాలి, అంతకు మించి వాడకూడదు. అంతేకాదు అల్సర్‌లతో బాధపడుతున్న వారు నెయ్యి తాగితే సమస్య త్వరగా తగ్గుతుంది. కాబట్టి నెయ్యి తీసుకుంటే బరువు పెరుగుతారన్న అపోహ మాత్రం వద్దని, రోజూ నెయ్యి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.