మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 14 మే 2019 (16:03 IST)

కాఫీ, టీలొద్దు.. పరగడుపున రెండు స్పూన్ల నెయ్యిని?

ఉదయం నిద్ర లేవగానే టీ కాఫీలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరు కాఫీ చుక్క గొంతులో పడందే బెడ్ మీద నుండి దిగడానికి ఇష్టపడరు. కానీ ప్రొద్దున్నే టీ కాఫీలు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దానికి ప్రత్యామ్నాయంగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని పరగడుపున త్రాగడం అలవాటు చేసుకుంటే అనేక రోగాలకు దూరంగా ఉండవచ్చు. 
 
నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలా మంది అపోహ పడుతుంటారు. కానీ దీనిలో ఎంత మాత్రం నిజం లేదు. పైగా నెయ్యిలో ఉన్న క్రొవ్వు పదార్థాలు బరువు తగ్గడానికి దోహదపడతాయి. ఉదయం నిద్రలేచిన తర్వాత నెయ్యి త్రాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపులోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. మలబద్దకం నుండి ఉపశమనం పొందవచ్చు. 
 
ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, కేశాల సంరక్షణకు నెయ్యి త్రాగితే మంచిది. ఆకలి మందగించిన వారు లేదా అజీర్తితో బాధపడేవారు ఉదయాన్నే నెయ్యి త్రాగితే ఆకలి పెరుగుతుంది. ఆల్సర్స్, కడుపులో మంటతో బాధపడేవారు కూడా నెయ్యి త్రాగితే ఫలితం ఉంటుంది.