గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 14 మే 2019 (13:37 IST)

ఏంటి..? ధోనీ తప్పుడు సలహాలు ఇచ్చాడా? కుల్దీప్ యాదవ్ ఏమన్నాడు?

అవును.. మీరు చదువుతున్నది నిజమే. టీమిండియా మాజీ కెప్టెన్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ.. దేశానికి వరల్డ్ కప్‌లు సంపాదించిపెట్టాడు. 2007 ఐసీసీ టీ-20 వరల్డ్‌ కప్‌, వన్డే వరల్డ్‌ కప్‌ తన సారథ్యంలో భారత్‌కు సాధించిపెట్టిన ధోనీ ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని టీమిండియాలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. 
 
అలాంటి వ్యక్తి తప్పుడు సలహా ఇచ్చాడంటే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే అంటున్నాడు.. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్. బౌలింగ్ చేసే సమయంలో ధోనీ చక్కని సలహాలు ఇస్తుండేవాడు.
 
ధోనీ సూచనలపై స్పందన ఏంటి.. అనే ఓ ప్రశ్నకు కుల్దీప్ యాదవ్ సమాధానం ఇచ్చాడు. ధోనీ ఇచ్చిన సూచనలు చాలా సందర్భాల్లో తప్పయ్యాయని.. కానీ ఆ విషయం ఆయనకు చెప్పలేమన్నాడు. కానీ ధోని ఎక్కువగా మాట్లాడడని, ఓవర్ల మధ్యలో మాత్రమే మాట్లాడతాడని, అదీ.. అవసరమైతేనేనని వెల్లడించాడు. 
 
ధోని ద్వారా తాను చాలా నేర్చుకున్నానని, ఆయన అనుభవం కుర్రాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించాడు. అయినప్పటికీ ధోనీ కూడా మానవమాత్రుడేనని, ఆయన కూడా తప్పులు చేస్తారని, ఆయన సూచనలు చాలాసార్లు పనిచేయలేదని తెలిపాడు.